హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని, త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్పష్టంచేశారు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో కొంత ఆలస్యమవుతున్నదని చెప్పారు. హైదరాబాద్ అబిడ్స్ స్కూల్లో ఆదివారం నిర్వహించిన ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పర్వత్రెడ్డి ఉద్యోగ విరమణ అభినందన సభకు హాజరై మాట్లాడారు. భావిభారత పౌరులను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని అన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక సంఘాలకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.