ఆన్లైన్ ఆటలతో ఆగం..పిల్లలు జర పైలం

- డెబిట్ కార్డులకు తల్లిదండ్రులు లిమిట్ పెట్టాలి
- సైబర్ మోసాలపై ఉపాధ్యాయులు వివరించాలి
- బానిసలు కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి
- ఆన్లైన్ గేమింగ్‌పై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు
హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు పిల్లలంతా ఒక్కచోట చేరితే క్రికెట్, షటిల్, కబడ్డీ, ఖోఖో ఆడుతూ కనిపించేవాళ్లు. మరిప్పుడో.. మొబైల్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ లాంటి గేమ్స్ ఆడుతూ కనిపిస్తున్నారు. పబ్జీ వంటి గేమ్స్ ఆడే పిల్లలైతే అరేయ్.. వాడిని వేసేయ్రా, వీడి వెనకాలే వెళ్లురా, దూరం నుంచి ఒకడు వస్తున్నడు జాగ్రత్తరా.. అంటూ తలను ఫోన్లో పెట్టేస్తున్నారు. కరోనా వల్ల ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్లు విపరీ తంగా పెరిగిపోయారు. ఎప్పుడూ ఏదో ఒక గేమ్, వద్దంటే తినటం మానేసి మారాం చేయటం అలవాటైంది. తల్లిదండ్రులు సైతం ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొంటున్నారు. కొందరు పిల్లలైతే గేమ్స్‌లో తర్వాతి లెవల్‌కు వెళ్లేందుకు డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఈ ఆన్లైన్ గేమ్స్ పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. తల్లిదండ్రులు డబ్బు కూడా వదిలించుకోవాల్సి వస్తున్నది. ఈ పరిస్థితి రాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే పిల్లల తల్లిదండ్రులు, టీచర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడ్వైజరీని కేంద్ర విద్యాశాఖ విడుదల చేసింది.
జాగ్రత్తలివీ
- తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్లైన్ గేమ్స్ కొనేందుకు అనుమతించకూడదు. ఓటీపీ ఆధారిత చెల్లింపులు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
- గేమ్స్‌లో సభ్యత్వం కోసం క్రెడిట్/డెబిట్ కార్డులను ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్ యాప్స్‌తో రిజిస్ట్రేషన్ చేయొద్దు.
- తెలియని వెబ్సైట్ల నుంచి సాఫ్ట్వేర్, గేమ్స్‌ను డౌన్లోడ్ చేయొద్దని పిల్లలకు చెప్పాలి.
- మాల్వేర్ ప్రమాదం రాకుండా వెబ్సైట్స్లోని లింక్‌లు, చిత్రాలు, పాప్అప్లను క్లిక్ చేసేప్పుడు పిల్లలు జాగ్రత్తలు తీసుకొనేలా చూడండి.
- గేమ్ డౌన్లోడ్ చేసేప్పుడు, ఆటలు ఆడేవారితో వ్యక్తిగత సమాచారం ఇవ్వొద్దని పిల్లలకు చెప్పాలి.
- తెలియనివారితో ఎట్టిపరిస్థితుల్లోనూ కమ్యూనికేట్ అవ్వకుండా చూడాలి. వెబ్‌క్యామ్, ప్రైవేట్ మెసేజింగ్, ఆన్లైన్ చాటింగ్‌కు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
- గంటలకొద్దీ గేమ్స్‌పై కూర్చోకుండా చూడాలి. లేకపోతే ఆరోగ్యం పాడయ్యే అవకాశం ఉన్నది.
- ఆన్లైన్ గేమ్ ఆడుతున్నప్పుడు తప్పు జరుగుతున్నట్టు అనిపిస్తే వెంటనే స్క్రీన్ షాట్ తీసి, గేమ్ సైట్ అడ్మినిస్ట్రేటర్‌కు రిపోర్ట్ చేయాలి.
- పిల్లలు ఆన్లైన్ గోప్యత పాటించేలా చూడాలి. వారికి ఒక స్క్రీన్ నేమ్ క్రియేట్ చేసి నిజమైన పేరును ఉపయోగించకుండా జాగ్రత్త పడాలి.
- పిల్లలపై నియంత్రణ కోసం గేమ్స్ ఆడే డివైజ్‌లో పేరెంటల్ కంట్రోల్, సేఫ్టీ ఫీచర్లను ఇచ్చే యాప్‌లను ఇన్స్టాల్ చేయాలి.
- పిల్లలు ఆడే గేమ్ వయసు రేటింగ్‌ను చెక్ చేయండి. ఓపెన్ ప్లేస్‌లో, కుటుంబ సభ్యులు ఉండే దగ్గరే పిల్లలు ఇంటర్నెట్ వాడేలా జాగ్రత్త పడండి.
- వీలున్నప్పుడల్లా పిల్లలతో కలిసి గేమ్ ఆడండి. వారు ఎవరితో ఆడుతున్నారు? వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నారా? అనేది తెలుసుకోవచ్చు.
- ఆన్లైన్ గేమ్స్‌లో కొన్ని ఫీచర్లు ఖర్చును ప్రోత్సహిస్తాయన్న విషయాన్ని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి.
నిఘా పెట్టాల్సిందే..
- పిల్లల ఆన్లైన్ యాక్టివిటీని ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి.
- సోషల్‌మీడియా, ఆన్లైన్లో ఉండే సమయంలో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి.
- మీరు దగ్గరకు వెళ్లినప్పుడు కంప్యూటర్ లేదా మొబైల్ స్క్రీన్‌ను మార్చుతున్నారా? అనేది చూసుకోవాలి.
- పిల్లల మొబైల్లో కొత్త ఫోన్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు ఉంటే అవేంటో ఆరా తీయాలి.
- ఇంటర్నెట్ వినియోగించాక పిల్లల ప్రవర్తన ఎలా ఉంది? అన్నది పరిశీలిస్తూ ఉండాలి.
- ఇంటర్నెట్ గేట్‌వేను ఇన్స్టాల్ చేసి పిల్లలు చూసే కంటెంట్‌ను మానిటరింగ్ చేయటం మంచిది.
- మార్కులు తక్కువగా రావటం, ప్రవర్తనలో మార్పులు రావటంపై టీచర్లు ఓ కన్నేసి ఉంచాలి.
- అనుమానాస్పదంగా, ఆందోళకరంగా అనిపిస్తే వెంటనే పాఠశాల నిర్వాహకులు, ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి.
- ఇంటర్నెట్ వినియోగంతో లాభాలు, నష్టాల గురించి పిల్లలకు అవగాహన కల్పించాలి.
- వెబ్ బ్రౌజర్లు, వెబ్ అప్లికేషన్లను సురక్షితంగా వినియోగించేలా విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి.
జాగ్రత్తలివీ..
- గేమ్‌లు డౌన్లోడ్ చేసేప్పుడు, ఇంటర్నెట్లో ఆటలు ఆడేవారితో వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వొద్దని పిల్లలకు చెప్పాలి.
- తెలియనివారితో ఎట్టిపరిస్థితుల్లోనూ కమ్యూనికేట్ అవ్వకుండా చూడాలి. వెబ్‌క్యామ్, ప్రైవేటు మెసేజింగ్, ఆన్లైన్ చాటింగ్‌కు దూరంగా ఉండేలా జాగ్రత్త పడాలి.
- పిల్లలు ఆన్లైన్ గోప్యత పాటించేలా చూడాలి. వారికి నిజమైన పేరు బదులు స్క్రీన్ నేమ్ క్రియేట్ చేయాలి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

