హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ) : అఖిలభారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ(ఏఐ జాక్టో) ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన నిరసన రాష్ట్రవ్యాప్తంగా విజయవంతమైనట్టు నేతలు ప్రకటించారు.
ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్టు తెలిపారు. ఫిబ్రవరి 5న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని పిలుపుఇచ్చారు. నిరసనలో నేతలు జీ సదానందంగౌడ్, చావ రవి, పీ మల్లికార్జున్‌రెడ్డి, ఏ వెంకట్, జుట్టు గజేందర్, పోల్‌రెడ్డి, కే శారద పాల్గొన్నారు.