హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : సర్దుబాటులో భాగంగా పాఠశాల విద్యాశాఖ అధికారులు పిల్లలున్న స్కూళ్లకు టీచర్లను బదిలీ చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 4వేలకు పైగా టీచర్లను సర్దుబాటు చేశారు. రాష్ట్రంలో 1,086 బడుల్లో సున్నా అడ్మిషన్లు ఉన్నాయి. వీటిలో 958 టీచర్లు పనిచేస్తున్నారు. ఒక విద్యార్థి ఉన్న బడులు 27 ఉండగా, అందులో 26 మంది టీచర్లు, 10లోపు విద్యార్థులున్న బడులు 2,133 కాగా, వీటిల్లో 2,217 మంది టీచర్లు పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఈవోలు, డీఈవోలు టీచర్ల సర్దుబాటును చేపట్టారు.
ఒకే ప్రాంగణంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్లు నడిస్తే.. ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్లు అధికంగా ఉండి, ప్రాథమిక పాఠశాలలో టీచర్ల కొరతంటే ఇక్కడ ప్రాథమికోన్నత టీచర్లు బోధించాలి.