కోనరావుపేట, ఫిబ్రవరి 24: ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కోనరావుపేట మండలం నిజామాబాద్ జడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు బ్రహ్మం 2నెలల క్రితం విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పుడు పిల్లలు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రధానోపాధ్యాయుడికి ఫిర్యాదు చేశారు. హెచ్ఎం పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి మరోసారి పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయుడిని మందలించారు. 4రోజుల క్రితం పాఠశాలలో ‘పోలీస్ అక్క’ నిర్వహించి గుడ్, బ్యాడ్ టచ్‌పై విద్యార్థినులకు వివరించారు. ఈ సందర్భంగా టీచర్ అసభ్యకర ప్రవర్తనను తెలుపగా ఆయనపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.