స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 5 : ప్రభుత్వ ఉపాధ్యాయుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగింది. జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ రమణారెడ్డి, మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం వివరాలు.. హనుమకొండ జిల్లా నడికుడ మండలం పులిగిల్లకి చెందిన వల్లాజి కిరణ్ (45) జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
శనివారం తెల్లవారుజామున కాజీపేట వైపు వెళ్లే గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి 15ఏండ్ల క్రితం వివాహం కాగా, ఆరు నెలలకే విడాకులయ్యాయి. మళ్లీ వివాహం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు తెలిపారు. పో లీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.