హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి ఏకే గంగాధరరావు శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేసి సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఆయనతోపాటు టీడీపీ మెదక్ నియోజకవర్గ కీలక నేతలైన మైనంపల్లి రాధాకిషన్‌రావు, తెలుగు యువత రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ ఏకే రమేశ్చందర్ కూడా బీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.