తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గుర్రం వెంకటేశ్వర్లు మంత్రి హరీశ్‌రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. హుజూరాబాద్ పట్టణకేంద్రంలోని ఆయన నివాసంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గుర్రం వెంకటేశ్వర్లు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే కొనసాగారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితులు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణపై అభిమానంతో టీఆర్ఎస్లోకి వచ్చినట్లు గుర్రం వెంకటేశ్వర్లు తెలిపారు. అనంతరం ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.