హైదరాబాద్, జూన్ 1(నమస్తే తెలంగాణ): తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తుంద ని, అందుకోసం నేతలంతా సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆ యన కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ టీడీపీ నాయకులతో సమావేశమై టీడీపీ బలోపేతంపై చర్చించారు. ఇక నుంచి తెలంగాణ రాజకీయాలకు సమయం కేటాయిస్తానని తెలిపారు.