యైటింక్లయిన్కాలనీ జూన్ 13: సింగరేణిలో కార్మిక సమస్యలు పేరుకపోవడంతో కార్మికులు ఆవస్థలు పడుతున్నారని, వీటిపై దశలవారీగా ఉద్యమాలు చేపడుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లాలోని ఆర్జీ-2 పరిధిలో వకీలుపల్లి గనిలో డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్కు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
కార్మిక సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు, జాతీయ సంఘాలు మూగబోయాయని విమర్శించారు. టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా ఉన్న కాలంలో తొలి సీఎం కేసీఆర్ సహకారంతో లాభాలవాటాను 16నుంచి 32 శాతానికి పెంచారని తెలిపారు.