రేవంత్ కండ్లు తెరువాలి: జీవన్‌రెడ్డి
ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మరణంతోనైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కండ్లు తెరువాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
జగిత్యాల, ఏప్రిల్ 24 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ మరణంతోనైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కండ్లు తెరువాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కడానికి, శంకర్‌గౌడ్ ఆత్మహత్యకు సీఎం రేవంత్‌రెడ్డే పరోక్ష కారణమని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించిందని, ఆ ప్రతిపాదన శాసనసభతోపాటు శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం పొందిందని గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ సమస్యలపై జాప్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ఆర్టీసీని ప్రైవేటీకరించడమే ప్రభుత్వ లక్ష్యమని విమర్శించారు. శంకర్‌గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.కోటి పరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శంకర్‌గౌడ్ మరణం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

