హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : కోర్టు కేసును పరిష్కరించి త్వరగా టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ప్రభుత్వాన్ని కోరింది. మంగళవారం హైదరాబాద్లో తపస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగగా, 2002, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్ అమలుచేయాలని కోరింది.