Padi Kaushik Reddy | హుజూరాబాద్‌లో పెద్ద ఆయకట్టు కొట్టుకుపోయిందని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. రిపేర్ చేస్తే దాదాపు ఏడు వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలోని తనుగుల చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చివేశారని తెలిపారు. మేడిగడ్డ మాదిరిగానే చెక్‌డ్యామ్‌ను బాంబు పెట్టి పేల్చేశారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడేందుకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అవకాశం కల్పించారు.
బాంబులు పెట్టి మేడిగడ్డ బ్యారేజీని పేల్చినట్టే
హుజూరాబాద్ నియోజకవర్గంలో
తనుగుల చెక్ డ్యామ్ ను పేల్చిండ్రు!– అసెంబ్లీలో ఎమ్మెల్యే @KaushikReddyBRS pic.twitter.com/zEec0mMfM3
— BRS Party (@BRSparty) December 29, 2025