కరీంనగర్ తెలంగాణచౌక్, మే10: మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపాలని శాంతిచర్చల కమిటీ చైర్మన్, విశ్రాంత న్యాయాధికారి చంద్రకుమార్ సూచించారు. కరీంనగర్ లోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పౌర హక్కుల సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు.
ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది మంది కేంద్ర బలగాలు కర్రెగుట్టల్లో చేపడుతున్న కూంబింగ్‌తో ఆదివాసీలు, మావోయిస్టులు, పోలీసులు చనిపోతున్నారని చెప్పారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎల్కతుర్తి సభలో డిమాండ్ చేయగా ప్రజల నుంచి స్పందన వచ్చిందని తెలిపారు.