సనత్‌నగర్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ బృందంతో కలిసి సనత్‌నగర్ పారిశ్రామికవాడలో పర్యటించారు.
ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్‌రెడ్డి ఒక్కరే ఫుట్‌బాల్ ఆడితే సరిపోదు కదా.. గ్రేటర్ పరిధిలోని పిల్లలు, యువత కూడా ఆటలు ఆడేందుకు స్థలం లేకుండా 9,292 ఎకరాల భూములను ప్రైవేట్‌పరం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఆగమేఘాల మీద జీవో తీసుకొచ్చి తక్కువ ధరలకే ప్రైవేట్ వ్యక్తులకు భూములను కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి పన్నుతున్న కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు.