BRS Party | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పదేపదే తప్పుడు పోస్టులు చేస్తున్న కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల్లో పలువురు పెడుతున్న అసహ్యకరమైన అడ్డగోలు.. ఫేక్పోస్టులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దాంతో నిజామాబాద్ జిల్లా కమిషనర్‌కి పార్టీ నేతలు పలు సామాజిక మాధ్యమాల్లో ఉన్న పోస్టులపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో సీసీఎస్ కేంద్ర కార్యాలయంలో గోషామహల్లో నియోజకవర్గం నాయకులు ఆశిష్ కుమార్ యాదవ్ స్థానిక ఏసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతోపాటు సిరిసిల్లలోనూ పలువురు యువ నాయకులు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌పై పలు పోస్టులపై ఫిర్యాదు చేశారు.
వరంగల్‌లో పలుచోట్ల అసత్యమైన సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ వైపు సీఎం రేవంత్, సోషల్ మీడియాలో ఇతర పార్టీలు తమపై దుష్ప్రచారం చేస్తున్నాయని.. మొసలి కన్నీరు కారుస్తూనే మరోవైపు తన పార్టీ కార్యకర్తలు, పెయిడ్ ట్రోల్స్‌తో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై నిరంతరంగా దుష్ప్రచారం చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అసహ్యకరమైన ఈ దుష్ప్రచారాన్ని ఆపకుంటే గట్టి సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్‌లో భాగంగా ఈ నీచమైన ప్రయత్నానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని.. ఇప్పటికైనా తమ బుద్ధి మార్చుకొని ఇతరులకు సుద్దులు చెబుతున్న తీరుగా.. తమ సొంత పార్టీ సోషల్ మీడియాను నియంత్రణలో ఉంచాలని సీఎంకి సూచించారు.