మల్హర్, జూన్ 27 : అనారోగ్యంతో బాధపడుతూ నడవలేని స్థితిలో ఉన్న ఓ రైతు ఇంటి వద్దకే వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేశారు మల్హర్ తాసిల్దార్ శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెకుంట గ్రామానికి చెందిన లింగపల్లి కాంతారావుకు 5.27 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. తన నలుగురు కుమారులకు భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు కుటుంబ సభ్యుల సహాయంతో మీసేవలో స్లాట్ బుక్ చేసుకున్నాడు.
కాంతారావు నడవలేని పరిస్థితిలో ఉన్నట్టు తెలుసుకున్న తాసిల్దార్ రిజిస్ట్రేషన్ సామగ్రిని, ధరణి ఆపరేటర్ సంతోష్‌తో కలిసి ఆయన ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సందర్భంగా కాంతారావుతోపాటు ఆయన కుమారులు తాసిల్దార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.