పెద్దవంగర, నవంబర్ 28: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర తహసీల్దార్ వీరగంటి మహేందర్‌తోపాటు అతడి వ్యక్తిగత డ్రైవర్ తుప్పాని గౌతమ్ శుక్రవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పోచంపల్లి శివారులోని పడమటి తండా గ్రామపంచాయతీకి చెందిన రైతు భూక్యా బాలు తండ్రి తోడే గత మార్చి 9న మరణించాడు.
గంట్లకుంట గ్రామ రెవెన్యూ పరిధిలో తోడే పేరిట ఉన్న 3.09 ఎకరాలు తనపేరున మార్చాలని సెప్టెంబర్ 25న మీసేవ కేంద్రంలో బాలు దరఖాస్తు చేశాడు. డిజిటలైజేషన్ చేసి నా భూభారతిలో నమోదు కాలే దు. దీంతో తహసీల్దార్ మహేందర్ ను కలువగా రూ.20 వేలు లంచం డిమాండ్ చేశాడు. ఆ మేరకు తహ సీల్దార్ వ్యక్తిగత డ్రైవర్ గౌతమ్‌కు రూ.15 వేలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.