హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ)లో ఎక్స్అఫిషియో సభ్యుల సంఖ్యను రెట్టింపు చేస్తూ ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 229ను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ అల్లోపతిక్ డాక్టర్ల అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ(టీఏడీఏ-జేఏసీ) డిమాం డ్ చేసింది. శనివారం హైదరాబాద్లో పలు వైద్య సంఘాలతో కలిసి రౌండ్ టే బుల్ సమావేశం నిర్వహించారు.
ఈ జీవో కు వ్యతిరేకంగా నల్ల బ్యాడ్జీలు ధరించి వైద్యులు విధులకు హాజరవుతారని ప్రతినిధులు తెలిపారు. పీఎంవో, ముఖ్యమంత్రి కార్యాలయం, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ, రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు వినతిపత్రాలు అందజేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో వైద్య సేవలు నిలిపివేస్తామని హెచ్చరించారు.