2021 పేస్కేల్‌ను సవరించండి
ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చల ఒప్పందంలో భాగంగా 2021 పే సేల్‌ను జూన్ నెల జీతంలో అమలు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ లో మార్పులు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది.
- ఆర్టీసీకి ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ వినతి
హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చల ఒప్పందంలో భాగంగా 2021 పేస్కేల్‌ను జూన్ నెల జీతంలో అమలు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ లో మార్పులు చేయాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యానికి వినతిపత్రం అందించినట్లు నాయకులు తెలిపారు. గతంలో ఇచ్చిన గ్రేడ్ పేను ఆర్పీఎస్- 2021 బేసిక్‌లో కలిపి వేస్తారని చర్చలు వస్తున్నాయని, దానిపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరారు.
సూచిక-3లోని సర్యులర్‌లో గ్రేడ్ పేను బేసిక్ పేలో కలిపి వేస్తూ నూతన సేల్‌ను ప్రతిపాదించారని, ఇది సరైనది కాదని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్పీఎస్-2017లో కొన్ని స్లాబ్స్ జూనియర్స్, సీనియర్స్ ఒకే సేలులో ఫిక్స్ చేశారని, వివిధ క్యాటగిరీల్లో 19 చోట్ల అలా జరిగిందని తెలిపారు. దీనివల్ల సీనియర్స్‌కు లాభం లేకుండా పోయిందని దానిని సరిచేయాలని కోరారు. ఇంక్రిమెంట్లు, ఇంటి అద్దెలు, ఇతర అలవెన్స్‌ల విషయంలో సరైన నిర్ణయం తీసుకొని, కొత్త సర్క్యులర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ నేత దౌర్జన్యం.. సంక్షేమ సంఘం కార్యదర్శిపై బూతుపురాణం
Smriti Mandhana | మంధాన శకంలో మొదటి అంకం.. నేడు జింబాబ్వేతో భారత్ తొలి టీ20
Jio Internet | జియోతో ఇంటర్నెట్ చౌక.. 6G సేవలపై ఎండీ ఆకాశ్ అంబానీ కీలక వ్యాఖ్యలు
Palamuru | నీళ్లెత్తేందుకు ఎందుకిన్ని డ్రామాలు.. విడుదల చేసిన నీళ్లు బీర్ల తయారీ కోసమా .. పొలాలకా!
Srisailam Project | నీళ్లన్నీ సద్దికట్టి.. నేడు సుద్దులు.. రేవంత్ సర్కార్ వైఫల్యంతో శ్రీశైలం ఖాళీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

