వద్దిరాజు చొరవతో స్వదేశానికి శ్వేత మృతదేహం.. ఇటీవల అమెరికాలో గుండెపోటుతో మృతి
ఇటీవల అమెరికాలో హనుమకొండకు చెందిన శ్వేత గుండెపోటుతో మృతి చెందగా.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఆమె మృతదేహాన్ని బుధవారం ఆమె స్వదేశానికి తీసుకొచ్చారు.
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): ఇటీవల అమెరికాలో హనుమకొండకు చెందిన శ్వేత గుండెపోటుతో మృతి చెందగా.. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చొరవతో ఆమె మృతదేహాన్ని బుధవారం ఆమె స్వదేశానికి తీసుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ వికాస్‌నగర్‌కు చెందిన ఏఎన్ఐటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కే లక్ష్మారెడ్డి, వెంకటలక్ష్మి దంపతుల కుమార్తె శ్వేత. ఆమె భర్త సురేశ్‌రెడ్డి, ఇద్దరు పిల్లలతో కాలిఫోర్నియాలో నివసిస్తూ, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు.
ఈ నెల 8న శ్వేత గుండెపోటుతో మృతి చెందింది. దీంతో ఆమె పార్థివదేహాన్ని స్వదేశానికి రప్పించాలని బంధువులు ఎంపీ వద్దిరాజు రవిచంద్రను కోరారు. స్పందించిన ఆయన హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. హోంమంత్రి అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులను ఆదేశించడంతో శ్వేత మృతదేహం హనుమకొండకు చేరింది. శ్వేత అంత్యక్రియలను స్థానిక పద్మాక్షిగుట్ట శ్మశానవాటికలో నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

