ఈ మత్స్యకారుడు.. మృత్యుంజయుడు.. మొసలి నోటికి చిక్కి బయటపడ్డ మహేశ్
మొసలి నోటికి చిక్కిన మత్స్యకారుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో చోటుచేసుకున్నది.
మదనాపురం, ఆగస్టు 9: మొసలి నోటికి చిక్కిన మత్స్యకారుడు త్రుటిలో ప్రాణాలతో బయటపడిన ఘటన వనపర్తి జిల్లా మదనాపురం మండలంలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్ర కారం.. గోపన్పేటకు చెందిన మత్స్యకారుడు మహేశ్ ఆదివారం రామన్పాడు జలాశయంలో చేపల వేటకు వెళ్లాడు.
చేపలు పడతుండగా మొసలి అతనిపై దాడి చేసింది. కుడికాలి పాదాన్ని నోటి తో గట్టిగా పట్టుకోగా.. మహేశ్ భయపడకుండా తన ఎడమకాలితో బలంగా మొసలిని తన్నాడు. దీంతో కుడి కాలిని విడిచిపెట్టిన మొసలి.. తన తోకతో ఎడమకాలిపై దాడిచేసింది. మహేశ్ త్రుటిలో తప్పించుకొని తోటి మత్స్యకారుల సా యంతో ఆత్మకూరు ప్రభుత్వ దవాఖానకు చేరుకున్నాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

