సూర్యాపేట : రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, హాస్టల్స్‌లో సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న మెదక్ జిల్లా రామాయంపేట ఆదర్శ పాఠశాల వసతి గృహంలో బల్లి పడిన అల్పాహారం తీసుకున్న పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటన మరవక ముందే తాజాగా సూర్యాపేట (Suryapet )జిల్లాలో గురుకుల పాఠశాల విద్యార్థిని(Gurukula school student,) అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం(Suspicious death) కలకలం రేపుతున్నది.
వివరాల్లోకి వెళ్తే.. సూర్యాపేట జిల్లానూతనకల్ మండలానికి చెందిన గురుకుల పాఠశాలను పెన్‌పహాడ్ మండలంలోని దోసపహాడ్‌లో నిర్వహిస్తున్నారు. అదే గురుకుల పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని మృతి చెందింది. గమనించిన హాస్టల్ సిబ్బంది బాలిక మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. మృతురాలి పేరెంట్స్ రావడంతో హాస్టల్ నిర్వాహకులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలిసింది. కాగా, సదరు విద్యార్థిని నూతన్‌కల్ మండలం మాశినపల్లి గ్రామానికి చెందినదిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.