కొత్తగూడ, జూలై 18: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపాల్ కల్పన సస్పెండ్ అయ్యారు. మరుగుదొడ్లు, నీటి సమస్య పరిష్కారంలో విఫలం కావడం, విద్యార్థుల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణల మేరకు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేస్తూ గురుకుల పాఠశాల కార్యదర్శి శనివారం సస్పెండ్ చేశారు.
డీఎడ్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్ హాజరు
హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): డీఎడ్ కాలేజీల్లోనూ ఫేషియల్ రికగ్నిషన్ హాజరును పకడ్బందీగా అమలు చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నవీన్ నికోలస్ వెల్లడించారు. ప్రభుత్వ డైట్ కాలేజీలు, ప్రైవేట్ డీఎడ్ కాలేజీల్లో విద్యార్థులు, అధ్యాపకులకు 2026 -27 విద్యాసంవత్సరం నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ను అమలుచేస్తామని పేర్కొన్నారు.