హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : అభియోగాలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. సస్పెండైన వారిలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, విశాల్ గున్నీ ఉన్నారు. కాంతిరాణా, విశాల్ గున్నీపై ముంబైకి చెందిన నటి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారనే ఆరోపణలుండగా, ఆంజనేయులు గత వైసీపీ ప్రభుత్వ హయా ంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
హైదరాబాద్, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : వస్ర్తాలంకార సేవల పేరుతో భక్తులను మోసగించిన దళారిపై తిరుమల రెండో టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తిరుమలలో ఓ దళారి తిరుమల ఆలయంలో వస్ర్తాలంకార సేవ కల్పిస్తానని చెప్పి గుంటూరు జిల్లా పట్టాభిపురానికి చెందిన భక్తులతో రూ.7లక్షలకు ఒప్ప ందం కుదుర్చుకున్నాడు. ముం దస్తుగా రూ.4లక్షలు వసూలు చేసి ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. దీంతో బాధితులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 15( నమస్తే తెలంగాణ): శాంతి, సోదరభావం, కరుణ, ధర్మబద్ధ జీవనాన్ని చాటిచెప్పే మహ్మద్ ప్రవక్త బోధనలు ప్రపంచానికి దిక్సూచి అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మిలాద్ ఉన్ నబీ పురస్కరించుకొని సీఎం రేవంత్రెడ్డి ఆదివారం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రవక్త జన్మదినం ముస్లింలకు ఎంతో పవిత్రమైనదని, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.