శంషాబాద్ రూరల్, నవంబర్ 9: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ఆలయాల విధ్వంసం ఘటనలు కలకలం సృష్టించాయి. వారంలో మూడుచోట్ల దాడులు చేసి విగ్రహాలను ధ్వంసం చేశారు.
జూకల్ గ్రామంలోని చౌడమ్మ, పోచమ్మ ఆలయాల్లో కొందరు దుండగులు చొరబడి దాడులు చేస్తుండగా అలికిడి విని స్థానికులు రాగా, 9 మంది దుండగుల్లో 8 మంది పారిపోగా, ఒక్కడిని పట్టుకున్నారు.