Konda Surekha | మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. సీఎం కాగానే నీకు కళ్లు నెత్తికెక్కినయా.. ? నాకు కౌంటర్ ఇస్తే నీ భాగోతాలన్నీ బయటపెడతా.. ఒకవైపు జెన్ జీకి టిక్కెట్లు అంటావ్.. మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరికి టికెట్ ఇస్తా అంటావ్..నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. పరకాల ఎమ్మెల్యేను నేనే. నీ తమ్ముడు షెల్ కంపెనీకి అప్పనంగా రూ. 200 కోట్ల విలువైన భూమిని ధారాదత్తం చేశావ్ నువ్వు, నీ తమ్ముళ్లు దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు.. నన్ను గెలికితే మీ స్కాంలు బయటపెడతానంటూ కొండా సుస్మిత తీవ్ర విమర్శలు చేయగా.. కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యల వల్ల పక్క పార్టీ వాళ్లు మమ్మల్ని ట్రోల్ చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయం. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలనడం సరికాదు. నన్ను బాధ్యురాలిని చేయడం సరికాదన్నారు. ఈ అంశంలో నా ప్రమేయం లేదని గుర్తించాలి. నాకు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలి. కాంగ్రెస్ నాయకత్వంపై నాకు గౌరవం ఉంది. ఇది సహజ న్యాయస్ఫూర్తికి విరుద్దమని కొండా సురేఖ పేర్కొన్నారు.