సూర్యాపేట : సూర్యాపేట(Suryapet) జిల్లా కేంద్రంలోని జిల్లా ఫిషరీష్ ఆఫీసర్(Fisheries officer) ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ(,ACB) సోదాలు కొనసాగుతున్నాయి. మత్స్య సహకార సొసైటీ సభ్యుల నుంచి రూ.25 వేలు లంచం తీసుకుంటూ జిల్లా మత్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో రూపేందర్ సింగ్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు ముమ్మరం చేశారు. గతంలో కూడా రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పని చేసినప్పుడు కూడా ఏసీబీకి పట్టుబడ్డారు.
2018 -19 నుంచి సూర్యాపేట అసిస్టెంట్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. లంచాలతో గద్వాల జిల్లా ఫిషరీస్ అధికారిక పోస్టింగ్ సంపాదించినట్లు తెలిసింది. ఉన్నతాధికారులను మేనేజ్ చేసి తిరిగి సూర్యాపేట జిల్లా అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి అర్హత లేకున్నా ఉన్నత స్థాయి అధికారులు నాన్ గెజిటెడ్ ఆఫీసర్‌కి గెజిటెడ్ హోదా కల్పించినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.