హైదరాబాద్, ఆగస్టు7 (నమస్తే తెలంగాణ) : పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై త్వరలోనే అధ్యయనం చేసేందుకు ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం సన్నాహాలు చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పటికే ఐఐటీ హైదరాబాద్ నిపుణులు డాక్టర్ సతీశ్ కేరే గొండ, ప్రొఫెసర్ కేబీవీఎన్ ఫణీంద్ర క్షేత్రస్థాయిలో ఇటీవలే పర్యటించారు.
ఈ సందర్భంగా స్థానిక అధికారులతో సమావేశమై.. భద్రాచలంతోపాటు వివిధ ప్రాంతాల్లో గోదావరి నదీతీర ప్రాంతాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారం తీసుకున్నట్టు తెలిసిం ది. ఈ నెలాఖరు నాటికి ఆయా ప్రాంతాలకు వెళ్లి ముంపుపై సర్వేని మొదలుపెట్టనున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి.