Surrender | సీపీ ఎదుట మావోయిస్టు దంపతుల లొంగుబాటు
Surrender | నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు(Maoist Family గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్(Warangal CP Ranganath) ఎదుట లొంగిపోయారు.
హనుమకొండ : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన మావోయిస్టు దంపతులు(Maoist Family) గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్(Warangal CP Ranganath) ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు కాసరనేని రవికుమార్ అలియాస్ అజిత్, ఆలియాస్ మున్నా, ఆలియాస్ సూర్యా, అతడి భార్య మడివి సోమిడి అలియాస్ కల్పన పోలీసుల ఎదుట లొంగిపోయారని సీపీ మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల మండలం కంభంపాడు గ్రామానికి చెందిన కాసరనేని రవికుమార్ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజనల్ కమిటీ మెంబర్, మణుగూరు ఎల్.ఓ.ఎస్ కమాండర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య మడివి సోమిడి చర్ల మండలానికి చెందినవారు కాగా ఆమె భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పాల్వంచ ఏరియా కమిటీ మెంబర్‌గా, మణుగూరు ఎల్వోఎస్ డిప్యూటీ కమాండర్(Deputy commander)గా కొనసాగుతున్నారు. వీరిద్దరికి విప్లవ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అనారోగ్యం(Health Issue) కారణంగా లొంగిపోయినట్లు సీపీ వెల్లడించారు.
స్వగ్రామంలో పదో తరగతి వరకు చదువుకున్న రవికుమార్ ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువును మధ్యలోనే ఆపివేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తమ బంధువుల ఇంటిలో కొద్ది సంవత్సరాలు ఉన్నాడు. ఇదే సమయంలో విప్లవ భావాలకు ఆకర్శితుడై 2012లో ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ డ్రేడ్ యూనియన్‌లో జాయిన్ అయ్యాడు. అనంతరం కొద్ది రోజులకు కొత్తగూడెం కార్మిక సంఘం అధ్యక్షుడిగా ఎంపికై ఆతర్వాత పీడీఎస్‌యూలో చేరాడు. 2016 లో మావోయిస్టుల సిద్ధాంతాలకు ఆకర్షితుడై రవికుమార్ తెలంగాణ మావోయిస్టు పార్టీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ ప్రోత్సాహంతో పార్టీ సభ్యుడిగా చేరారు.
చర్ల ఏరియా కమాండర్ సోడి జోగయ్య నాయకత్వంలో పనిచేశాడు. 2017 సంవత్సరంలో డిప్యూటీ కమాండర్‌గా పనిచేసిన రవికుమార్ 2019లో మావోయిస్టు పార్టీ (Maoist Party)మణుగూరు ఎల్.ఓ.ఎస్ ఏసీఎం మడవి సోమిడి అలియాస్ కల్పనను వివాహం చేసుకున్నాడు. రవికుమార్‌పై ప్రభుత్వం గతంలో రూ. 5లక్షల రివార్డు(Reward)ను ప్రకటించింది.
మడివి సామిడి అలియాస్ కల్పన మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలు, ప్రసంగాలు, పాటలకు ఆకర్షితురాలై 2017లో మావోయిస్టు పార్టీలో చేరింది. 2018లో చర్ల ఎల్.ఓ.ఎస్ సభ్యురాలిగా, 2020 సంవత్సరంలో ఏసీఎం, మణుగూరు ఎలోఓఎస్ డిప్యూటీ కమాండర్‌గా పనిచేసింది. 2021 సంవత్సరంలో సుక్మా జిల్లా జీరమతీ గ్రామంలో పోలీసు బలగాలపై దాడికి పాల్పడిన ఘటనలో ఆమె నిందితురాలు. ఈమెపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 4లక్షలు రివార్డు ప్రకటించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

