నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జనవరి 3 (నమస్తే తెలంగాణ): లగచర్ల రైతులపై నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న రెండో నిందితుడు సురేశ్‌ను విచారణ నిమిత్తం 3 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సురేశ్‌ను న్యాయవాది సమక్షంలోనే ప్రశ్నించాలని, ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించరాదని ఆదేశించింది. దీంతో శనివారం నుంచి సోమవారం వరకు సురేశ్‌ను ప్రశ్నించనున్న బొంరాస్‌పేట పోలీసులు.. కస్టడీ గడువు ముగియగానే ఆయనకు ఉస్మానియా దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టు ఎదుట హాజరుపర్చాల్సి ఉన్నది.