హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): ఒక వ్యక్తి ప్రజాసేవకుడై ఉండటం, ప్రభావితం చేయాలనుకున్న చర్య అతని ప్రజాపదవి నుంచి రావడం అనే రెండు అంశాలు ఉంటే.. అవినీతి నిరోధక చట్టం ఎందుకు వర్తించదని సుప్రీకోర్టు ధర్మాసనం ఓటుకు నోటు కేసులో ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో బుధవారం విచారణకు వచ్చిన ‘ఓటుకు నోటు కేసు’ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిన్ మోహనతో పాటు ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి పలు కీలక ప్రశ్నలు సంధించారు. ఎమ్మెల్యేకు రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటుహకు అతని పదవి కారణంగానే లభిస్తున్నప్పుడు, అది పదవిరీత్యా నిర్వహించే రాజ్యాంగబద్ధమైన చర్య కాదా? అని ప్రశ్నించారు.
ప్రభావితం చేయాలనుకున్న ఓటు ఎమ్మెల్యే ప్రజాపదవి నుంచే ఉద్భవించిందా? అనే అంశాన్ని పరిశీలించాలని పేరొన్నారు. సాధారణ ఓటరుకు ఓటుహకు ప్రజాపదవి వల్ల రాదని అన్నారు. పట్టభద్రుడికి విద్యార్హత కారణంగా, ఉపాధ్యాయుడికి వృత్తిపరమైన అర్హత కారణంగా ఓటు హకు వస్తుందని చెప్పారు. ఎమ్మెల్యేకు మాత్రం అతని పదవి కారణంగానే ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ ఎన్నికలో ఓటు హకు లభిస్తుందని తేడాను ప్రస్తావించారు. ఓటు వేయడం చట్టబద్ధమైన హకే అయినప్పటికీ, ప్రజాసేవకుడైన ఎమ్మెల్యే పదవి నుంచి ఉద్భవించిన ఓటును లంచంతో ప్రభావితం చేస్తే అవినీతి నిరోధక చట్టం వర్తించే అవకాశం ఉంటుందని ధర్మాసనం పేరొంది. అయితే విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలను తుది నిర్ధారణగా పరిగణించవద్దని స్పష్టంచేసింది. చట్టంలోని అన్ని కోణాలను పరీక్షించి స్పష్టత పొందేందుకే ప్రశ్నలు లేవనెత్తుతున్నామని తెలిపింది.
రేవంత్‌రెడ్డి తరఫున సిద్ధార్థ వాదనలు
ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న ప్రస్తుత సీఎం, నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా సుమారు వాదనలు వినిపించారు. 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని అన్నారు. 2018 అవినీతి నిరోధక సవరణ చట్టంలో మాత్రమే లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరంగా పరిగణించారని తెలిపారు. 2015లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి 2018 అవినీతి నిరోధక చట్టం వర్తించదని చెప్పారు. ఎఫ్ఐఆర్, జనరల్ డైరీ ఎంట్రీ లేకుండానే ట్రాప్ చేశారని పేర్కొన్నారు. అయితే, ఓటు వేయడం చట్టబద్ధమైన హకు అని, దీనిని ప్రభావితం చేస్తే అవినీతి నిరోధక చట్టం వర్తిస్తుందని జస్టిస్ జోయ్ మాల్య బాగ్చి స్పష్టంచేశారు.
ఫిర్యాదు అందుకున్న తర్వాత ఏసీబీ డీజీ, డీఎస్పీకి పరిశీలన-చట్టపరమైన చర్యలకు ఆదేశించారని ప్రాసిక్యూషన్ తెలిపింది. దీంతో డీఎస్పీ, హైదరాబాద్ టాస్‌ఫోర్స్ సహాయంతో ప్రాథమిక విచారణ నిర్వహించారని, ఫిర్యాదుదారు ఇచ్చిన ఆడియో-వీడియో సమాచారాన్ని సేకరించారని చెప్పారు. మధ్యవర్తులను ఏర్పాటు చేసి పుష్ప నిలయం వద్ద ఏసీబీ అధికారులు నిఘా పెట్టారని, అప్పుడే ఏ1, ఏ2 కలిసి అకడికి చేరుకున్నారని, తర్వాత ఏ3 నగదు బ్యాగుతో వచ్చాడని, టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి రూ. 5 కోట్ల ఒప్పందం జరిగిందని పేరొన్నది. రూ. 50 లక్షలు అడ్వాన్స్ లంచంగా టేబుల్‌పై ఉంచారని తెలిపింది. మిగిలిన రూ. 4.5 కోట్లను ఎమ్మెల్సీ ఎన్నిక అనంతరం చెల్లిస్తామని హామీ ఇచ్చారని, ఈ సంభాషణ, నగదు, ఆడియో-వీడియో రికార్డులు, మధ్యవర్తుల నివేదిక ఆధారంగా నేరం ప్రాథమికంగా ఏర్పడుతున్నదని ప్రాసిక్యూషన్ చెప్పింది. పూర్తి ఆధారాలతో విచారణ దశలో నిర్ణయించాలని, ప్రారంభ దశలో కేసును రద్దు చేయవద్దని ప్రాసిక్యూషన్ కోరింది.