అలంపూర్, డిసెంబర్ 27 : అష్టాదశ శక్తిపీఠాల్లో ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం సుప్రీంకోర్టు జడ్జి ఎస్వీఎన్ భట్టి కుటుంబ సమేతంగా దర్శిచుకున్నారు. ఆలయ పాలక మండలి కమిటీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి, ఈవో పురేందర్‌కుమార్ స్వాగతం పలికి, జోగుళాంబ జ్ఞాపికను అందజేశారు. వారి వెంట గద్వాల డీఎస్పీ సత్యనారాయణ, అలంపూర్ సీఐ రవిబాబు, ఎస్సై వెంకటస్వామి, తాసీల్దార్ మంజుల ఉన్నారు.