‘పోలవరం’పై సుప్రీంకోర్టు సమన్లు
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన దావాలో సుప్రీంకోర్టు తాజాగా ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది.
హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన దావాలో సుప్రీంకోర్టు తాజాగా ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ తయారీ తదితర అంశాలపై ముందుకు వెళ్లకుండా ఏపీ సర్కార్‌ను నిలువరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దావా వేసిన తెలంగాణా ప్రభుత్వం.. అందులో ఏపీ సహా 13 మందిని ప్రతివాదులుగా చేర్చింది.
కానీ, ఇప్పటివరకు ప్రతివాదులకు నోటీసులను జారీచేయకపోవడంతో సుప్రీంకోర్టు ఇటీవల ఆ పిటిషన్‌పై చేపట్టేందుకు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసిన అనంతరం విచారణ చేపడతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తాజాగా ప్రతివాదులకు నోటీసులను జారీచేసింది. సమన్లు అందిన నాటినుంచి 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. నిర్ణీత సమయంలో ప్రతివాదులు హాజరుకాకపోతే చట్టప్రకారం వారి గైర్హాజరులోనే దావాను విచారించి, తీర్పు వెలువరిస్తామని సమన్లలో తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

