నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 30: సీఎం కేసీఆర్‌కు మద్దతు వెల్లువెత్తుతున్నది. సోమవారం గజ్వేల్‌లో ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్, సింగారం గ్రామస్తులు కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. తమ మద్దతు సీఎం కేసీఆర్‌కే అంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాలను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డికు అందజేశారు. వర్గల్ మండలం సామలపల్లి, శాకారం గ్రామాలకు చెందిన కుర్మ, ముదిరాజ్ కులస్తులు సీఎం కేసీఆర్ వెంటే ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన జక్కుల సంఘం సభ్యులు మంత్రికి మద్దతుగా సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కారు గుర్తుకే ఓటేస్తామని వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం ఎర్రగడ్డతండావాసులు ప్రకటించారు.