Sunke Ravishankar | కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో బడ్జెట్లో ప్రజలకు గుండు సున్నా పెట్టారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ విమర్శించారు. వ్యవసాయ రంగానికి తక్కువ నిధులు కేటాయించారని అన్నారు. రైతుభరోసా, ఉపాధి హామీకి సరిపడా నిధులు కేటాయించలేదని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇప్పటికీ హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజల సొమ్మును ఢిల్లీకి తీసుకెళ్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.