గంగాధర, జూన్ 8: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. గోపీనాథ్ మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించుకున్న గోపీనాథ్ కష్టపడి రాజకీయాల్లో కష్టపడి అంచలంచెలుగా ఎదిగారని గుర్తు చేశారు. శాసనసభ్యునిగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు చేశారన్నారు.
హైదరాబాద్ మహానగరంలో నాయకుడిగా గోపీనాథ్ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడని పేర్కొన్నారు. మాగంటి గోపీనాథ్ తో తనకున్న అనుబంధాన్ని రవిశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గోపీనాథ్ కాపాడడానికి వైద్యులు చేసిన కృషి, పార్టీ తరఫున చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ మరణంతో శోకతప్తులైన కుటుంబ సభ్యులు, మిత్రులు, అభిమానులకు సుంకె తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.