Sun Intensity | తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తుతున్నారు. ఎండ వేడికి ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో పలు జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అత్యధికంగా భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 45 డిగ్రీలు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వేంపల్లిలో 44.8 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా కెరమెరిలో 44.7 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా చిట్యాల 44.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లా కద్దం పెద్దూరు 44.2, ఆదిలాబాద్ జిల్లా చప్రాలా 44.2, రాజన్న సిరిసిల్ల జిల్లా మల్లారం 44.1, నిజామాబాద్ జిల్లా మెండోరా 44, కరీంనగర్ జిల్లా గంగిపల్లి 43.9, ఆదిలాబాద్ జిల్లా అర్లి (టీ)లో 43.9 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.