రాంచీ: దుబాయ్‌లో నర్స్ ఉద్యోగమని చెప్పి తన కూతురిని అక్కడ పని మనిషిగా మార్చారని ఓ యువతి తండ్రి రాంచీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రైవేట్ కన్సల్టెన్సీ ఏజెంట్ ప్రియాంక ఆర్య, ఆమె భర్త రితేశ్, మెరాజ్ అన్సారీలపై కేసు నమోదైంది. బాధితురాలు మోనికా కచ్చప్కు ప్రియాంక ఆర్య పరిచయమయ్యారు. దుబాయ్‌లో నర్స్ ఉద్యోగం ఇప్పిస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు.
రితేశ్ అరబిక్‌లో ఉన్న కొన్ని పత్రాలపై బాధితురా లితో సంతకాలు చేయించి, రూ.3.30 లక్షలు అప్పుగా తీసుకొన్నట్టు..ఆ మొత్తం చెల్లించిన తర్వాతనే ఆమెను భారత్‌కు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తారని ఆమెకు తెలిపారు. ఆమె ఆమె పాస్‌పోర్టును కన్సల్టెన్సీ కంపెనీ ఏజెంట్లు స్వాధీనం చేసుకొన్నారని బాధితురాలి తల్లి వెల్లడించారు.