సిరిసిల్ల తెలంగాణ చౌక్, జూన్ 21: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపాధి లేక.. కుటుంబం గడవకపోగా పైగా అనారోగ్యం.. దీనికితోడు అప్పుల భారంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడ్డాడు. సిరిసిల్ల టౌన్ ఎస్సై శ్రీనివాస్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సుందరయ్యనగర్‌కు చెందిన వలస రమేశ్(45) నేత పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. రెండేండ్ల క్రితం కాలు విరగ్గా, వైద్యం కోసం అప్పుచేశాడు.
అప్పటినుంచి ఆరోగ్యం సహకరించకపోవడం, పనిచేయలేని స్థితిలో ఉండటంతో మద్యానికి బానిసయ్యాడు. సుమారు రూ.4 లక్షల వరకు అప్పులు చేయగా, అవి ఎలా తీర్చాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తిచెంది శనివారం పట్టణంలోని కార్గిల్‌లేక్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.