మల్యాల, ఏప్రిల్ 14: రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సభ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి జగిత్యాలలో నిర్వహించే బీఆర్ఎస్ సభతో ఆరంభమవుతుందని చెప్పారు. జగిత్యాల జిల్లా మ ల్యాల మండలం ముత్యంపేటలో మంగళవారం నిర్వహించిన మల్యాల మండల బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి హాజరై మాట్లాడారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి కొద్దిరోజులుగా ప్రభుత్వ విధానాలు నచ్చక ఇ టీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేశారని, 20న జగిత్యాల సభలో కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డి చేరికతో మల్యా ల, కొడిమ్యాల మండలాల్లో బీఆర్ఎస్ మరింత పుంజుకుంటుందని చెప్పారు.