విద్యుత్తు కోతలను నిరసిస్తూ సుమారు 500 మంది శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ సత్యం, కాంగ్రెస్ మైనార్టీ నేత షబ్బీర్ పాషా వచ్చి ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు.
రెండు రోజులుగా విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి కరెంట్ సరఫరాను పునరుద్ధరించడంతో ఆందోళన విరమించారు.
– ఖానాపూర్