హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో నూతన కార్యాలయాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పటాన్చెరు కార్యాలయ పరిధిలోకి పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాలు రానున్నాయి. రామగుండం కార్యాలయ పరిధిలోకి రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలు వస్తాయి. మెదక్ రిజిస్ట్రేషన్ జిల్లా కేం ద్రాన్ని సంగారెడ్డి నుంచి పటాన్చెరుకు మార్చనున్నారు.