ఖమ్మం రూరల్, మే 26 : ఓ డాక్యుమెంట్ రైటర్ మధ్యవర్తిత్వం ద్వారా రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ అరుణ సోమవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమేశ్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తికి రూరల్ మండలం తల్లంపాడులో సర్వే నంబర్ 713/ఏ2లో 2,700 చదరపు గజాల స్థలం ఉంది. ఆ భూమిని తన కొడుకు పేరుపై గిఫ్టు రిజిస్ర్టేషన్ చేయించేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాడు. సబ్ రిజిస్ట్రార్ రూ.50 వేలు డిమాండ్ చేశారు. రూ.30 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మొత్తాన్ని రైటర్ వెంకటేశ్‌కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.