హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు, మైనింగ్ రంగాల్లో టెక్నాలజీ వినియోగంపై రాష్ట్ర ప్రతినిధి బృందం విదేశాల్లో అధ్యయనం చేయనున్నది. ఈ మేరకు సోమవారం నుంచి జూలై 1వరకు యూకే, జర్మనీ దేశాల్లో పర్యటించనున్నది.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇంధనశాఖ సెక్రటరీ నవీన్‌మిట్టల్, సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్, విద్యుత్తు సంస్థల సీఎండీలు కృష్ణభాస్కర్, హరీశ్, ముషారఫ్ ఫారూఖీ, వరుణ్‌రెడ్డి, రెడ్కో వీసీ అండ్ ఎండీ అనిలలు ఈ ప్రతినిధి బృందంలో ఉన్నారు. వీరు సోమవారం పర్యటనకు బయల్దేరి.. వారం రోజులపాటు ఈ రెండు దేశాల్లో అధ్యయనం చేయనున్నారు.