నమస్తే తెలంగాణ ఫొటోగ్రాఫర్, నిర్మల్ : నిర్మల్ జిల్లా మంజులాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకే మరుగుదొడ్డి ఉండటంతో ఒంటి కీ, రెంటికీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో 271 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో 150 మంది బాలికలు.. 121 మంది బాలురు. వీరందరికీ ఒకే మరుగుదొడ్డి ఉండటంతో బాలికలు ఒంటికీ, రెంటికీ బారులుదీరుతున్నారు.
బాలురు కాంపౌండ్ వాలు దాటి బయటకు వెళ్తున్నారు. సమస్యను గుర్తించిన గత బీఆర్ఎస్ సర్కారు ‘మన ఊరు-మన బడి’ కింద రూ.1.17 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులు పనులు పూర్తి చేయించి మరుగుదొడ్లను ఉపయోగంలోకి తీసుకురావాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది కోరుతున్నారు.