మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు దిగిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగింది. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం వండటం లేదని, అన్నం సరిగ్గా ఉడకకపోవడం, కూరల్లో నీళ్లు ఉండి తినలేక పోతున్నామని వాపోయారు. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, లైన్లో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తున్నదని చెప్పారు.
ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎంఈవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఎంఈవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.