బోథ్, డిసెంబర్ 20: ఆదిలాబాద్ జిల్లా బోథ్‌లోని గిరిజన సంక్షేమ వసతిగృహ విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. సరైన భోజనం పెట్టడం లేదని మధ్యాహ్నం 12.40 నుంచి 1.05 గంటల వరకు బోథ్ బస్టాండ్ వద్ద నిరసన చేపట్టారు.
ఏటీడీవో సుచరిత్ ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టి వార్డెన్ బాలాజీపై చర్యలు తీసుకుంటామన్నా విద్యార్థులు వినలేదు. దీంతో సుచరిత్ ఐటీడీఏ డీడీ అంబాజీతో ఫోన్లో మాట్లాడించినా వారు వినిపించుకోలేదు. ఎస్సై శ్రీసాయి విద్యార్థులకు నచ్చజెప్పి హాస్టల్‌కు తీసుకెళ్లారు.