జోగుళాంబ గద్వాల : కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీదకు వస్తున్నారు. కాంగ్రెస్ అసమర్ధ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో(Aija town) డిగ్రీ కాలేజీతోపాటు వసతి గృహాలను ఏర్పాటు చేయాలని విద్యార్థులు(Students) పోస్ట్‌కార్డు ఉద్యమం(Postcard movement) చేపట్టారు. అయిజ పట్టణంలోని ప్రభుత్వ, హరిహర జూనియర్ కళాశాలల విద్యార్థులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి సోమవారం సీఎం రేవంత్‌రెడ్డికి చేరేలా పోస్టుకార్డులను రాయించి పోస్ట్ చేయించారు.
ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. అయిజలో డిగ్రీ కళాశాల లేకపోవడంతో పేద విద్యార్థులు ఇంటర్‌తోనే చదువు మానేసి పంట పొలాల్లో కూలీలుగా మారుతున్నారన్నారు. డిగ్రీ చదివేందుకు బాలిక లను సుదూర ప్రాంతాలకు పంపేందుకు తల్లిదండ్రులు ముందుకురావడం లేదన్నారు. ఇంటర్‌తోపాటు ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు వసతి గృహాలను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను సకాలంలో నడపాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను పరిష్కరించకుంటే దశల వారీగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.