Food Poison | తాండూరు, డిసెంబర్ 14: ‘మా పిల్లలు ఉన్నరో, పోయిర్రోనని చూసేందుకు వచ్చిం డ్రా’ అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిపై తాండూ రు గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. తాండూరులోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఇటీవల ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యా రు.
వారిలో తాండూరులోని ప్రభు త్వ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున్న తొమ్మిది మందిని శనివారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నతోపాటు కాంగ్రెస్ నేతలు పరామర్శించేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే మ నోహర్రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై మాకు న మ్మకం లేదని, ఈ దవాఖానలో త్వరగా కోలుకోకపోతే ప్రైవేటు దవాఖానకు తీసుకుపోయి చూపించుకుంటామని చెప్పారు.
‘మా పిల్లలు ఇలా కావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం’ అని గట్టిగా చెప్పారు. హాస్టల్లో ఎప్పటికప్పు డు అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలిస్తే పిల్లలకు ఈ గతి పట్టేది కాకుండేదని చెప్పారు. దీంతో అవాక్కైన ఎమ్మెల్యే అక్కడ ఎక్కువ సే పు ఉండలేకపోయారు. ‘పిల్లలకు అంతా మంచిగానే ఉన్నదని, తల్లిదండ్రులు ఆందోళ న చెందవద్దని, వసతి గృహంలో పాత సిబ్బందిని తొలగించి, కొత్తవారిని పెట్టాం’ అని తల్లిదండ్రులకు చెప్తూనే ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అక్కడి నుంచి హడావుడిగా వెళ్లిపోయారు.